Banner
Back to Blogs

చందుపట్ల గ్రామంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ

BSYM Mar 24, 2026
చందుపట్ల గ్రామంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ
చందుపట్ల గ్రామంలో భగత్ సింగ్ యువజన మండలి ఆధ్వర్యంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భగత్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ దిగాజు లతా వెంకటచారి గారు, ఉప సర్పంచ్ ఓరుసు శీను–మంజుల గారు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ భగత్ సింగ్ త్యాగాలు, దేశభక్తి భావం యువతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

అలాగే గ్రామ వార్డ్ సభ్యులు సండ్ర సంతోష్, పుట్ట నాగయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్ క్లబ్ అధ్యక్షుడు అంబటి ఎల్లేష్ గారు, ఉపాధ్యక్షులు వడ్డే బోయిన శివ, ఉపేందర్, నాగయ్య, నరేష్, గోపి, లక్ష్మణ్ తదితర సభ్యులు ఈ ర్యాలీ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

గ్రామంలో దేశభక్తి వాతావరణం నెలకొని, యువతలో ఉత్సాహం వెల్లివిరిసింది.