భగత్ సింగ్ యువజన సంఘానికి నూతన అధ్యక్షుడిగా సండ్ర సిద్దు ఏకగ్రీవ ఎన్నిక.. కొత్త కార్యవర్గం ఎంపిక
చందుపట్ల, ఆగస్టు 3: నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని భగత్ సింగ్ యువజన సంఘం క్లబ్‌లో 03-08-2026 తేదీన నిర్వహించిన సమావేశంలో సంఘ సభ్యులు ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
సభ్యుల నిర్ణయం మేరకు ప్రస్తుత అధ్యక్షుడు అంబటి ఎల్లేష్ మరియు ఆయన కార్యవర్గాన్ని రద్దు చేసి, నూతన అధ్యక్షుడిగా సండ్ర సిద్దును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షుడిగా టంగుటూరి జానీ, కార్యదర్శిగా మోర్సు ప్రణయ్ కుమార్, క్యాషియర్‌గా వడ్డే బోయిన శివకుమార్, సలహాదారుడిగా దేశ బోయిన యుగేందర్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సండ్ర సిద్దును సంఘ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. నూతన కార్యవర్గం సంఘ అభివృద్ధి, సభ్యుల ఐక్యత, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో సమిష్టిగా పనిచేస్తామని వెల్లడించింది.
సమావేశంలో పాల్గొన్న సభ్యులు నూతన కార్యవర్గానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో కలిసి జ్ఞాపకార్థంగా గ్రూప్ ఫోటో దిగారు.
ఈ సమావేశంలో భగత్ సింగ్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.